దుర్గంధం వెదజల్లుతున్న గోదావరి

by Disha Web Desk 23 |
దుర్గంధం వెదజల్లుతున్న గోదావరి
X

దిశ,గోదావరిఖని : గోదారి కంపు కొడుతుంది.. పారిశుద్ధ్యం పడకేసింది. పర్యవసానంగా నీరంతా కలుషితమవుతుంది. అవును ఇది అక్షరాల నిజం.. గోదావరిఖని నగర శివారులోని గోదావరి నది వద్ద సమ్మక్క సారలమ్మ ఘాట్ వద్ద కొద్దిరోజులుగా పారిశుధ్యం లోపించి చెత్తాచెదారం పూర్తిగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులు దుర్వాసనతో భరించలేక బయటకు వచ్చేస్తున్నారు. గోదావరి నది మెట్ల వద్ద పూర్తిగా చెత్తా చెదారం పేరుకుపోయి భక్తులు కనీసం గోదావరి నదిలోకి దిగేందుకు కూడా అనుకూలించని పరిస్థితి నెలకొన్నది. రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారుల నిర్లక్ష్యానికి , పనితీరుకు ఈ గోదావరి అద్దం పడుతుంది.



Next Story