వైభవంగా గుమ్లాపూర్ వేంకటేశ్వర స్వామి జాతర

by Disha Web |
వైభవంగా గుమ్లాపూర్ వేంకటేశ్వర స్వామి జాతర
X

దిశ, కోరుట్ల రూరల్: మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనీల్, కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు, బీజేపీ నేత సురభి నవీన్ రావు, జెఎన్ సునీతా వెంకట్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. గ్రామ ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో జాతరలో పాల్గొని శ్రీనివాసుడిని దర్శించుకున్నారు..

సంగెంలో రామస్వామి జాతర..

మండలంలోని సంగెం గ్రామశివారులో గల రామస్వామి గుట్టపై జాతర ఘనంగా నిర్వహించారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో కమలకర్ రావు, రాంచందర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.Next Story