ఈ భక్తుడు మామూలోడు కాదు... ఏకంగా దేవతనే ఇరకాటంలో పెట్టేశాడు

by Disha Web |
ఈ భక్తుడు మామూలోడు కాదు... ఏకంగా దేవతనే ఇరకాటంలో పెట్టేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: భక్తులు దేవుళ్ల దగ్గర కోరికలు కోరడం సహజం. అయితే, ఓ భక్తుడు మాత్రం తన కోరిక ఏమిటో లేఖ రూపంలో తెలియజేశాడు. అంతేకాదు.. తనని ఆదుకుంటే అమ్మవారి గుడి నిర్మాణానికి సహాయం చేస్తానంటూ రాశాడు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కేంద్రంలో దుర్గమాత్ర విగ్రహం పాదాల దగ్గర ఓ అజ్ఞాత భక్తుడు ఓ లేఖను వదిలివెళ్లాడు. తన నుంచి ఓ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడని, అవి వచ్చేలా చూస్తే జగిత్యాలలో జరుగుతున్న గుడి నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆ లేఖ వైరల్ అవుతూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ లేఖను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో ఈ భక్తుడు మాములోడు దేవుళ్లనే ఇరాకటం పెట్టిండు అంటూ చెవులు కొరుక్కుంటున్నారంట.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed