ఆ గ్రామంలో వింత... భూమి పోయిందని ఒకరు - భూమి కావాలని ఇంకొకరు

by Dishanational1 |
ఆ గ్రామంలో వింత... భూమి పోయిందని ఒకరు - భూమి కావాలని ఇంకొకరు
X

దిశ, రామడుగు: ఆ గ్రామంలో ఒకేరోజు రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. భూమి కబ్జా చేశారని ఒకరు, ప్రభుత్వ భూమి మాకే కావాలని మరికొందరు. ఈ రెండు ఘటనలతో ఎమ్మార్వోకు తలనొప్పిగా మారింది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడంటే రామడుగు మండలంలోని దేశరాజుపల్లి గ్రామంలో ఉగ్గరి లింగయ్య అనే రైతు తన భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విలేకరులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లింగయ్య కొడుకు తిరుపతి మాట్లాడుతూ 1987లో గ్రామానికి చెందిన పలువురి రైతుల నుంచి 5 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ భూమి పక్కనే ఉన్న సర్పంచ్ 30 గుంటలను సుమారు ఏడేళ్ల క్రితం కబ్జా చేయడం జరిగిందన్నారు. తన భూమి కబ్జాకు గురైందని తహశీల్దారుతోపాటుగా ఆర్డీవోకు పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇట్టి విషయంపై అధికారులు స్పందించి సర్వేర్లు పంపి సర్వే చేసి సంబంధిత పత్రాలు అందించాలని ప్రయత్నించగా ఆ సర్పంచ్ పత్రాలను లాక్కొని తీసుకెళ్లారని బాధితులు ఆరోపించారు. దీనిపై ఇకనైనా అధికారులు స్పందించి తన భూమిని ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కొందరు పేదస్తులు మండలం శివారులోని సర్వే నెంబర్ 383లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం తమకే కావాలని మంగళవారం ఏకంగా ఎమ్మార్వో కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ 383 సర్వే నెంబర్లు ఎకరం 10 గుంటల ప్రభుత్వ స్థలంలో గతంలో రైతు వేదిక నిర్మించారని అన్నారు. ఉన్న మిగతా భూమిలో గ్రామంలో ఉన్న పేదస్తులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ రెండు ఘటనలతో మండల రెవెన్యూ బాస్ అయిన ఎమ్మార్వో కు తలనొప్పిగా మారింది.


Next Story

Most Viewed