ప్రభుత్వ పాఠశాలల ప్రగతి పై ప్రత్యేక దృష్టి : ముజమ్మిల్ ఖాన్

by Disha Web Desk 23 |
ప్రభుత్వ పాఠశాలల ప్రగతి పై  ప్రత్యేక దృష్టి : ముజమ్మిల్ ఖాన్
X

దిశ,పెద్దపల్లి: విద్యార్థుల హాజరు శాతం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఎంపిక చేసిన ఐదు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఐదు ముఖ్యమైన అంశాలపై మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలకు సంబంధించిన లెసన్ ప్లాన్, టి.ఎల్.ఎం. తయారు చేసుకుని లెర్నింగ్ అవుట్ కమ్స్ రాబట్టాలని అన్నారు.

ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులచే చేయిస్తున్న కృత్యాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించాలని, తల్లిదండ్రులతో ఏర్పాటు చేసే సమావేశంలో విద్యార్థుల ద్వారా ప్రదర్శనలు ఇచ్చే విధంగా చూడాలని, దీని ఫలితంగా పాఠశాలలో జరిగే బోధన, అభ్యాసాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుందని సూచించారు.పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ ద్వారా వచ్చే కూరగాయలను మధ్యాహ్న భోజనంలో ఉపయోగించాలని, అలాగే అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు . నెల చివరన తొలి మెట్టు, ఉన్నతి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంపై సమీక్షించడం జరుగుతుందని అన్నారు.ఈ సమీక్షా సమావేశంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్. పి.ఎం.షేక్, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed