అనర్హులకు దళిత బంధిస్తున్నారని కొందరు..అక్రమ నిర్మాణాల అపాలని మరికొందరు..

by Disha Web Desk 23 |
అనర్హులకు దళిత బంధిస్తున్నారని కొందరు..అక్రమ నిర్మాణాల అపాలని మరికొందరు..
X

దిశ, జగిత్యాల టౌన్: సమస్యలకు పరిష్కారం చూపవలసిందిగా కోరుతూ సోమవారం జగిత్యాల ప్రజావాణికి దరఖాస్తుదారులు పోటెత్తారు. దరఖాస్తులను పరిశీలించిన అదనపు కలెక్టర్లు బీఎస్ లత, దివాకర లు ప్రజావాణి అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

అనర్హులకే దళిత బంధు ఇస్తున్నారని..

మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి గ్రామస్తులు డబ్బు పలుకుబడి ఉన్న వారికి దళిత బంధు ఇస్తున్నారని ఫిర్యాదు చేసి అర్హులైన వారికే పథకం అందేలా చూడాలని కలెక్టర్ కు విన్నవించారు.

ప్రభుత్వ భూమిని కాపాడండి..

కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామస్తులు ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నెంబరు 309లో గల సుమారు 50 ఎకరాల గుట్ట బోరు భూమిలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి చదును చేసి బోరు వేయగా, గ్రామస్తులు అడ్డుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులను అశ్రాయించారు.

అక్రమ నిర్మాణాన్ని ఆపండి..

పట్టణంలోని రాంబజార్ ద్వారక నగర్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆముద రమణ వ్యక్తి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసాడు. మున్సిపల్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ, ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసిన నిర్మాణం ఆగడం లేదని కలెక్టర్ చొరవ తీసుకుని అక్రమ నిర్మాణాన్ని ఆపేల చర్యలు చేపట్టాలని కోరాడు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story