సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులకు అస్వస్థత

by Aamani |
సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులకు అస్వస్థత
X

దిశ,కోరుట్ల టౌన్ : సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలిపారు. వెంటనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని కోరుట్ల వైద్యాధికారి సునీత తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ , తహసీల్దార్ మహమ్మద్ ఫరూక్, మండల వైద్యాధికారి గంగుల నరేశంలు పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఎండీ.అతిక్, చిత్తారి ఆనంద్, ప్రభు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed