బీఆర్ఎస్‌కు భారీ షాక్... సిరిసిల్లలో..

by Gopi |
బీఆర్ఎస్‌కు భారీ షాక్... సిరిసిల్లలో..
X

దిశ, సిరిసిల్ల టౌన్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హయాంలో సీపీఎం అనుబంధ సంఘంగా కొనసాగిన రాజన్న సిరిసిల్లా జిల్లా అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుయ్యాక టీఎన్ జీఓ అనుబంధ సంఘంగా ఇప్పటివరకు కొనసాగింది. అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు, రిటైర్ మెంట్ బెన్ ఫిట్స్ కల్పించాలని ప్రభూత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో విసుగుచెందిన అంగన్ వాడీలు ఏఐటీయూసీ అనుబంధ సంఘంలో చేరనున్నట్లు సమాచారం. టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ గెలుపు, నేడు కేటీఆర్ ఇలాకాలో టీఎన్ జీఓ నుండీ అంగన్ వాడీలు దూరమవ్వడం చూస్తూంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుండి ఒక్కొక్క సంఘం వేరుపడటం ఖాయమనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story