'మంత్రి మల్లారెడ్డి మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి'

by Dishanational1 |
మంత్రి మల్లారెడ్డి మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
X

దిశ, మల్లాపూర్: అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి తీరును డివిజన్ రెడ్డిలు తీవ్రంగా ఖండిచారు. మల్లారెడ్డి వెంటనే రెడ్డి మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవలసి వస్తుందని హెచ్చరించారు. రెడ్డి మహిళల గురించి ఎలాంటి అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఈరోజు రెడ్డిలు సమాజంలో ఇంతటి గౌరవం పొందుతున్నారంటే అది రెడ్డి మహిళల పాత్ర ఎంతో ఉందని, రెడ్డి మహిళలు కుటుంబానికి సేవ చేస్తూ చుట్టూ ఉన్న అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటూ, వారి సాధక,బాధక విషయాల్లో తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారన్నారు. మీకిష్టమైతే మీరిప్పుడు కూడా వేరే కులం అమ్మాయిని చేసుకోండి, అంతేకాని రెడ్డి అమ్మాయిల గురించి అవగాహన లేని మాటలు మాట్లాడొద్దని రెడ్డి సమాజం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక మంత్రిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడనని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, అంతవరకు తమ రెడ్డి సమాజం నిరసన సెగలు ఎగసిపడుతూనే ఉంటాయని తెలిపారు.


Next Story