సైదాపూర్‌లో అధిక ధరలకు మద్యం విక్రయాలు

by Dishanational1 |
సైదాపూర్‌లో అధిక ధరలకు మద్యం విక్రయాలు
X

దిశ, సైదాపూర్: అంబికా వైన్స్, నాగేంద్ర వైన్స్, శ్రీ రామ వైన్స్ ల యజమానులు సిండికేట్ గా ఏర్పడి అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సోమ్ము చేసుకుంటున్నా సంబంధిత అబ్కారీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్వహరించటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది అర్థం కావటం లేదు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో గతంలో రెండు వైన్స్ లు ఉండేవి కానీ, ఈసారీ తెలంగాణ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన మరో ఒకవైన్స్ షాపును పెంచడంతో మండలంలో మొత్తం మూడు వైన్స్ షాపులు ఉన్నాయి. మూడు వైన్స్ ల యజమానులు సిండికేట్ గా మారి శ్రీరామ వైన్స్ ను రిటెల్ షాపుగా మార్చి మండలంలోని బెల్టుషాపులకు అధిక ధరలకు క్వాటర్ కు రూ.10, బీరుకు రూ.15 అదనంగా తీసుకుంటూ ఒక్క రోజుకు సుమారుగా రూ. లక్షల్లో సోమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఒకే భవనంలో నాగేంద్ర వైన్స్, అంబికా వైన్స్ లను నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. ఇదంతా తెలిసినా ఆబ్కారీ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మూడు వైన్స్ షాపులకు ఒకటే సిట్టింగ్ రూంను ఏర్పాటు చేసి మద్యం ప్రియులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్టి వైన్స్ షాపులపైన హుజూరాబాద్ ఆబ్కారీ శాఖ సీఐ దుర్గాభవానీకి, జిల్లా సూపరిండెంట్ కి, ఆబ్కారీ శాఖ కమిషనర్ కు దూరవాణి ద్వారా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




Next Story

Most Viewed