- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
by Disha Web Desk 23 |

X
దిశ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట ఎక్సైజ్ సీఐ మహమ్మద్ అక్బర్ హుస్సేన్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన అంబటి రమేష్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై 6.2 లీటర్ల మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నాడన్న సమాచారం మేరకు దాడి చేసి మద్యంతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎవరైనా మద్యాన్ని అక్రమంగా తరలించిన, నిల్వ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడిలో ఎక్సైజ్ ఎస్సైలు రమాదేవి, కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య, కానిస్టేబుల్ లు విశ్వజ్ఞ, రేణుక, మౌనిక పాల్గొన్నారు.
Next Story