రౌడీ షీటర్ దారుణ హత్య..

by Disha Web |
రౌడీ షీటర్ దారుణ హత్య..
X

దిశ, గోదావరి ఖని: ఆదివారం రాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కలకలం సృష్టించింది. పట్టణంలోని నడి చౌరస్తాలో.. అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన రౌడీ షీటర్ మంథని సుమన్ (41) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తితో దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రౌడీషీటర్ సుమన్ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు దృవీకరించారు. గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుమన్ ను.. పాత కక్షలతోనే వారి బంధువులు హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది.

అందరూ చూస్తుండగానే దాడి..

పట్టణంలోని చౌరస్తాలో మృతుడు సుమన్ బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఓ జాతీయ పార్టీకి చెందిన నేతతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇదే చౌరస్తాలో హనుమాన్ నగర్‌లో జరిగిన ఓ హత్య కేసులో సుమన్ ప్రధాన నిందితుడు. అందరూ చూస్తుండగానే మృతుడి పై దాడి జరగడంతో ఖనిలో కలకలం రేగింది.
Next Story