పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి..

by Disha Web Desk 13 |
పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి..
X

దిశ, వెల్గటూరు: పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట ర్యాలీగా వెళుతున్న యువకుల బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను కొట్టి.. అనంతరం కారుకు ఢీకొన్నారు. ఈ ఘటనలో వెల్గటూర్ మండలం ముక్కట్రావ్ పేట గ్రామానికి చెందిన కూస రాజకుమార్ (20)స్పాట్లోనే మృతిచెందగా కుమ్మరి పల్లి గ్రామానికి చెందిన జక్కుల అంజి కి కాలు విరిగింది.


అలాగే కిషన్ రావు పేట గ్రామానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ నీలం సాగర్ లకు కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు రాజ్ కుమార్ జక్కుల అంజి పవన్ కళ్యాణ్ అభిమానులు కావడం విశేషం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి' వాహన పూజకు కొండగట్టు ధర్మపురి కి రాగా వీరు ధర్మపురి కి వెళ్లారు. ధర్మపురి నుంచి పవన్ కళ్యాణ్ వాహనం వెల్గటూర్ మీదుగా కరీంనగర్ వెళ్తుండగా యువకులంతా ఆ వాహనం వెంట బైకులతో ర్యాలీగా వెళ్లారు.

ఇదే ర్యాలీలో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంతో వేగంగా వెళ్తూ.. కిషన్రావుపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో బైకును ఢీ కొట్టి అదుపుతప్పి కుడి పక్క నుంచి జన్నారం వెళ్తున్న కారును ఢీకొట్టారు. ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెల్గటూరు ఎస్సై నరేష్ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. మృతుడి శవాన్ని పోస్టుమార్టం తరలించారు. మృతుడు రాజకుమార్ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story