- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాక రేపుతున్న రేవంత్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు
దిశ, జగిత్యాల ప్రతినిధి : టీపీసీసీ రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు విషయంలో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం రేవంత్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.చంద్ర శేఖర్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు : కాంగ్రెస్ నాయకులు
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రేవంత్ మాటలను ఉద్దేశపూరితంగా వక్రీకరిస్తూ పొలిటికల్ మైలేజ్ పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నిరసన కు కౌంటర్ గా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. సీఎం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేసారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. పోటాపోటీ నిరసనల నేపథ్యంలో జగిత్యాలలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.