దిశ ఎఫెక్ట్.. కదిలిన యంత్రాంగం

by Sumithra |
దిశ ఎఫెక్ట్.. కదిలిన యంత్రాంగం
X

దిశ, రామడుగు : రామడుగు మండల కేంద్రంలోని మిషన్ భగీరథ ట్యాంకు నుండి నల్ల పైపు ద్వారా పోతున్న నీటి పై నిన్న దిశ దినపత్రికలో తాగునీరు వృధా అనే శీర్షిక వెలువడటంతో కదిలి వచ్చి మరమ్మతులు చేపించిన వైనం. ఈ సందర్భంగా రామడుగు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మిషన్ భగీరథ ట్యాంక్ నుండి నల్లా ద్వారా రోడ్డుపాలు అవుతున్న మంచినీరు విషయంలో మండల అభివృద్ధి అధికారిని రాజేశ్వరి మండల మిషన్ భగీరథ ఏఈ ప్రకాష్ పంచాయతీ కార్యదర్శి దేవరకొండ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సిబ్బందితో మంగళవారం మరమ్మత్తులు చేపించడం జరిగింది. దిశ పత్రికలో ప్రచురితమైన త్రాగు నీటి వృధా శీర్షిక పట్ల అధికార బృందం స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed