స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2022లో రాజన్న సిరిసిల్ల టాప్

by Disha Web Desk 19 |
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2022లో రాజన్న సిరిసిల్ల టాప్
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ్ 2022 నవంబర్ నెలలో 4 స్టార్ కేటాగిరిలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే మొదటిస్థానం సాధించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్ చేస్తూ సిరిసిల్ల అధికార యంత్రాంగ్రాన్ని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ తాగునీరు-పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ (డి.డి.డబ్ల్యుఎస్.) రాజన్న సిరిసిల్ల అధికారులను ప్రశంసించారు. వెల్ డన్ అంటూ అభినందిస్తూ డి.డి.డబ్ల్యుఎస్ అధికారిక ట్విట్టర్ హాండిల్‌లో పోస్ట్ చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2022 కింద నవంబర్ మాసంలో 4 స్టార్ కేటగిరీలతో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం దక్కడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ.. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులకు అభినందలు తెలియజేశారు. నిరంతర మీ మార్గదర్శనం, సహకారం వాళ్ళే ఇది సాధ్యమైoదంటూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed