- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వ టీచర్ల ప్రైవేట్ దందాలు

జిల్లాలో కొందరు ప్రభుత్వ టీచర్లు బిజినెస్ మెన్లుగా మారారు. సైడ్ ఇన్‌కమ్ కోసం అడ్డదారులు తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు దందాలు చేస్తున్నారు. బిజినెస్ చేయడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో బిజినెస్ చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. నలుగురికి మంచి చెప్పాల్సిన టీచర్లే పర్మిషన్ లేకుండా ఫైనాన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా చిట్టీలు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు అడ్మిషన్లు చేస్తున్నారు. టీచర్లుగా సమాజంలో వారి పై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ టీచర్లు ఆర్‌బీఐ గైడ్ లైన్స్‌ను తుంగలో తొక్కి ఫైనాన్స్ చిట్టీలు నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అయినా వారిని కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో చాలామంది ప్రభుత్వ టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తుంటే ఇలాంటి కొందరు టీచర్లు చేస్తున్న అక్రమ దందాలు విద్యాశాఖకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి.
దిశ, జగిత్యాల ప్రతినిధి : మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సొంత మండలంలోనే కొంతకాలం పనిచేశాడు. ఈ క్రమంలో తనకున్న పరిచయాలతో చిట్టీల వ్యాపారం, ప్రైవేట్‌గా ఫైనాన్స్ దందా నిర్వహించాడు. ప్రస్తుతం కోరుట్లలో డ్యూటీ చేస్తూ అక్కడ సైతం తన వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అయితే సొంత ఊరు ప్రజలే చిట్టీలు, ఫైనాన్స్ పేరుతో తమను మోసం చేశాడని కొద్ది నెలల కింద సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడి పై ఫిర్యాదు చేశారు. ఓ సామాజిక వర్గానికి చెందిన ఈ టీచర్ చట్టంలో ఉన్న లొసుగును ఆధారంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు సదురు ఉపాధ్యాయుడి పై ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది.
కోరుట్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కింగ్ మేకర్‌లా మారాడు. ఇటీవల కోరుట్లలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ వేసి ప్లాట్ల అమ్మకాలు కొనసాగించాడు. రియల్ ఎస్టేట్ సైడ్ బిజినెస్‌గా మెయింటేయిన్ చేస్తూ ప్రభుత్వ టీచర్‌గా ఉన్న పేరును పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ఫైనాన్స్ కూడా నిర్వహిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ప్రైవేటు దందాలు చేస్తున్నాడు.
కొడిమ్యాల మండలానికి చెందిన సీనియర్ గవర్నమెంట్ టీచర్ బడా కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు పీఆర్వోగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యా బోధనను అవమానించేలా ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్స్‌కు విద్యార్థులను రిఫర్ చేస్తున్నాడు. కమీషన్ల కక్కుర్తిలో పడి కార్పొరేట్ సంస్థల మార్కెటింగ్ పర్సన్స్‌తో కలిసి పేరెంట్స్‌ను కన్విన్స్ చేస్తూ అడ్మిషన్స్ దందాకు తెరలేపాడు.
జిల్లాలో కొందరు ప్రభుత్వ టీచర్లు బిజినెస్ మెన్లుగా మారారు. సైడ్ ఇన్‌కమ్ కోసం అడ్డదారులు తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు దందాలు చేస్తున్నారు. బిజినెస్ చేయడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డదారిలో బిజినెస్ చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. నలుగురికి మంచి చెప్పాల్సిన టీచర్లే పర్మిషన్ లేకుండా ఫైనాన్స్, రిజిస్ట్రేషన్ లేకుండా చిట్టీలు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు అడ్మిషన్లు చేస్తున్నారు. టీచర్లుగా సమాజంలో వారి పై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ టీచర్లు ఆర్‌బీఐ గైడ్ లైన్స్‌ను తుంగలో తొక్కి ఫైనాన్స్ చిట్టీలు నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అయినా వారిని కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో చాలామంది ప్రభుత్వ టీచర్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తుంటే ఇలాంటి కొందరు టీచర్లు చేస్తున్న అక్రమ దందాలు విద్యాశాఖకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి.
ఆ రెండు దందాల్లో సగానికి పైగా ప్రభుత్వ టీచర్లే..
ఫైనాన్స్, చిట్టీల నిర్వహణ ప్రతి పల్లెలో సాధారణంగా నడుస్తున్న వ్యవహారమే. చిట్టీలు నిర్వహించాలనుకునే వారు ముందుగా చిట్‌ఫండ్స్ యాక్ట్ 1982 ప్రకారం జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ శాఖ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే ఈ దందా చేస్తున్న వారిలో కేవలం 30 శాతం మంది మాత్రమే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అనుమతులు పొంది ఆర్బీఐ గైడ్ లైన్స్ అనుసరిస్తూ బిజినెస్ చేస్తున్నారు. మిగిలిన 70 శాతంలో సగానికి పైగా ప్రభుత్వ టీచర్లే రూల్స్‌కు విరుద్ధంగా 5 నుంచి 10 శాతానికి వడ్డీలకు ఇవ్వడంతోపాటు చిట్టీలను నడిపిస్తున్నారు. ఈ టీచర్ల అక్రమ దందా వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో రావాల్సిన డబ్బు టీచర్ల జేబుల్లోకి వెళ్తుంది. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న టీచర్లు ఈ విధంగా ప్రైవేట్ దందాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా మరికొందరు ప్రభుత్వ టీచర్లు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. కమిషన్ కక్కుర్తిలో పడి హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వేసిన వెంచర్లలో స్థానికులతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. కోరుట్లలో ఓ ప్రభుత్వ టీచర్ అయితే ఏకంగా డీటీసీపీ అనుమతులు లేకుండా లే అవుట్ లేని వెంచర్ వేసి దర్జాగా బిజినెస్ చేస్తుండడం అనేక విమర్శలకు తావునిస్తుంది.
యూనియన్ల ముసుగులో స్కూళ్లకు డుమ్మా..
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో యూనియన్ల పాత్ర అత్యంత కీలకమైనది. విద్యాశాఖలో యూనియన్లు ఎక్కువగానే ఉండగా ఈ సంఘాలు అన్ని ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఫైట్ చేస్తూ వస్తున్నాయి. అయితే కొంతమంది టీచర్లు ఈ సంఘాల ముసుగులో స్కూళ్లకు డుమ్మాలు కొడుతున్నట్లు తెలుస్తోంది. యూనియన్ల పేరు చెప్పి కనీసం పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ వచ్చినా థంబ్ వేసి వెళ్లిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా సంఘాల ముసుగులో చదువులు చెప్పడం మానేసి సొంత వ్యాపారాల్లో బిజీ అవుతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలోనే ఓ టీచర్ అయితే ఏకంగా సెలవు పెట్టకుండానే పొలిటికల్ ప్రోగ్రామ్స్‌లో ప్రత్యక్షమవడం పెద్ద చర్చకే దారి తీసింది.
ప్రైవేటుగా బిజినెస్ చేయడం టీచర్ల వ్యక్తిగతం.. రాము, డీఈఓ, జగిత్యాల
ప్రభుత్వ టీచర్ల బిజినెస్ వ్యవహారాలు మా దృష్టికి రాలేదు. గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ బిజినెస్‌లు చేయడం వారి పర్సనల్ విషయం. నిబంధనలు పాటించకుండా బిజినెస్‌లు చేస్తే సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా టీచర్లు మోసం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. రూల్స్ ప్రకారం 48గంటలు కస్టడీలో ఉంటే అలాంటి వారిని సస్పెండ్ చేస్తాం. యూనియన్లలో ఉన్న టీచర్లు లీవ్ పెట్టకుండా సమాచారం లేకుండా డ్యూటీలకు వెళ్లకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.