- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కకు వినతిపత్రం..
విద్యారంగ సమస్యలను డీఈవో గాలికొదిలేశారంటూ ఏబీవీపీ నాయకుల వినూత్న నిరసన
దిశ, జగిత్యాల ప్రతినిధి : ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డీఈవోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా ఏబీవీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కుక్కకు వినతిపత్రం ఇస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి మనవాడ నందు మాట్లాడుతూ.. ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులను ఇబ్బందులకి గురి చేస్తున్నాయని, పాఠశాలలో చేరిన రోజే 50 శాతం ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతోనే ఈ రకంగా నిరసన తెలుపుతున్నామని పేర్కొ్న్నాను. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ చార్జి అంజి, రాకేష్, ప్రశాంత్, వినీత్, తదితరులు పాల్గొన్నారు. కాగా, కుక్కకు వినతిపత్రం ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.