- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
దిశ,మంథని : ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక గణపతి హోమాన్ని మంత్రి నిర్వహించారు. ఆదివారం మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట గజానణ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఆయన సతీమణి శైలజ రామయ్యర్ దంపతులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గణనాథుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
కేటీఆర్‌ది అతి తెలివి
మంత్రి శ్రీధర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరు అతి తెలివితేటలు చూపిస్తున్నారో అర్ధమవుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలేనని, వారందరినీ గౌరవిస్తామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. దీనిని కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.