అంబేద్కర్ లేకుంటే బానిసలుగా బతికేవాళ్లం: నల్లాల భాగ్యలక్ష్మి

by Dishanational1 |
అంబేద్కర్ లేకుంటే బానిసలుగా బతికేవాళ్లం: నల్లాల భాగ్యలక్ష్మి
X

దిశ, మందమర్రి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బానిసలుగా బతికేవాళ్లని మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదెలు అన్నారు. మంగళవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సింగరేణి పాఠశాల ముందర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్థూపం వద్ద 66వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత నేత అంబేద్కర్ అని అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మందమర్రి కన్వీనర్ మొయ్య రాంబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మొయ్య రాంబాబు, పల్లె నర్సింగ్, కనకం వెంకటేశ్వర్లు, రవి వాల్మీకి, ఎండి కలీం, రామ్ వేణు, మద్ది శంకర్, పైడిమల్ల నర్సింగ్, ఎం.డి. పాషా తదితరులు పాల్గొన్నారు.


తెలుగుదేశం పార్టీ అనుబంధం టీఎన్టీయూసీ కార్యాలయంలో ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. సంజయ్ కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండీ షరీఫా, పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, వాసాల సంపత్, తిరుపతి కనకయ్య ముల్కల సుధీర్ లు ఉన్నారు.

మందమర్రి బీఎస్పీ పార్టీ కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గం ఇంచార్జ్ తుంగపండి రమేష్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పులిపాక శ్రీనివాస్, మామిడిపల్లి ప్రకాష్, కన్నూరి కృష్ణ, హరి పాల్గొన్నారు.

బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని సింగరేణి అంబేద్కర్ గ్రీన్ పార్క్ లో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్త కుమార్ స్వామి, బీజేపీ రాష్ట్ర నాయకులు రామటెంకి దుర్గారాజ్, దుర్గం సత్యంబాబు, పళ్లెం రాయలింగు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed