మైనర్లకు మద్యం విక్రయించిన వైన్స్ యజమాన్యం

by Disha Web Desk |
మైనర్లకు మద్యం విక్రయించిన వైన్స్ యజమాన్యం
X

దిశ, ముత్తారం: చిన్నారులకు మందు ఇవ్వడం నేరం. అని తెలిసిన ఇటువంటి చిన్నారుల చేతనే మా తాతకు మా నాన్నకు అని సాకులు చెబితే మద్యం ఇవ్వడం ఎంత పెద్ద నేరమో... అందరికీ తెలిసిందే. 21 ఏండ్లు నిండిన మేజర్లకు మాత్రమే మద్యం సీసాలను విక్రయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మైనర్ల ని వైన్ షాప్ దరిదాపుల్లోకి కూడా రానివ్వ వద్దని ఈ నిబంధనలు పరోక్షంగా తెలియజేస్తూ ఉండగా, ముత్తారం వైన్ షాప్ యాజమాన్యాలు మాత్రం ఈ నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయి. షాపులకు వైన్ షాప్ యాజమాన్యాలే చిన్నపిల్లలకు మద్యం ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

అడ్డగోలుగా బెల్లుషాపులు

ముత్తారంలో బెల్టు షాపులకు అడ్డు అదువు లేకుండా పోయింది. వైన్ షాప్ యాజమాన్నాలు ధనార్జనే బెల్టుషాపులను వాడవాడకు ప్రోత్సహిస్తున్నాయి. దీనితో మద్యం దుకాణాలు సమయం అయిపోయిన తర్వాత కూడా, బెల్టు షాపుల ద్వారా 24 గంటల పాటు మద్యం ప్రియులకు మద్యం అర్ధరాత్రి తేడా లేకుండా మద్యాన్ని సేవించి రోడ్లపై సంచరించే యువత సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఇక బెల్ట్ షాపులు మునుగులో వైన్ షాప్ యాజమాన్యాలు నకిలీ మద్యాన్ని కూడా విక్కయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మద్యంప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి.. బెల్టుషాపులు ముసుగులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయినా, బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వారిపై ఇంతవరకు పోలీసులు కానీ, ఎక్సైజ్ సిబ్బంది కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులకు తెలియ వచ్చిన పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి. ఒకే ఓకే క్లస్టర్ లో రెండు మద్యం షాపుల సిండికేట్ గా ఏర్పాటు ద్వారా, ముత్తారం గ్రామాన్ని మద్యం కేంద్రంగా మార్చారని స్థానికులు మండిపడుతున్నారు. నియమ నిబంధనల మేరకు మద్యం దుకాణాలను నిర్వహిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ మద్యం షాపు యాజమాన్యాలు బెల్టుషాపులను, ప్రోత్సహిస్తూ, చిన్న పిల్లల చేతికి మద్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story