- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుట్టుగా గుట్కా వ్యాపారం..

మంథని మండలంలో నిషేధిత గుట్కా, అంబర్, ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా లభిస్తున్నాయి. దీంతో యువత నిషేధిత గుట్కాలు, మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసలవుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంబర్, తంబాకు ఇతర గుట్కాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా మంథని పట్టణంలో ఓ వ్యక్తి ఉల్లి గడ్డలు, ఆలు గడ్డల మాటున నిషేధిత గుట్కా వ్యాపారం బహిరంగగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దందా కొద్దీ సంవత్సరాలుగా సాగుతుందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కూరగాయాల మార్కెట్‌ను అడ్డాగా ఏర్పర్చుకుని ఇక్కడి నుంచే నేరుగా పలువురి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీటికి బానిసలై అనారోగ్యం భారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మంథని కేంద్రంలో ఈ గుట్కా దందా తీరును చూస్తేనే అది ఏ స్థాయిలో సాగుతుందో అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిషేధిత అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
దిశ, మంథని : మంథని మండలంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబార్, ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా లభిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో యువత నిషేధిత గుట్కాలు, మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసలవుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంబార్, తంబాకు ఇతర గుట్కాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దీంతో యువత పెడదారి పడుతున్నారు. ముఖ్యంగా మంథని పట్టణంలో ఓ వ్యక్తి ఉల్లి గడ్డలు, ఆలు గడ్డల మాటున నిషేధిత గుట్కా వ్యాపారం బహిరంగంగా కొనసాగిస్తున్నాడు. ఈ దందా కొద్దీ సంవత్సరాలుగా సాగుతుందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కూరగాయాల మార్కెట్‌ను అడ్డాగా ఏర్పర్చుకున్నాడు. ఇక్కడి నుంచే నేరుగా పలువురు కొనుగోలు చేస్తున్నారు. వీటితో అనారోగ్యం భారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ వ్యాపారం మంథని కేంద్రంలో ఈ గుట్కా దందా వ్యాపారం సాగుతున్న తీరును చూస్తేనే అది ఏ స్థాయిలో సాగుతుందో అర్ధం అవుతుంది. ఈ దందా మంథని వ్యాప్తంగా ఏ తరహాలో విస్తరించి సాగుతుందో చూస్తేనే తెలుస్తుంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిషేధిత అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
జోరుగా అమ్మకాలు..
మంథని మండలంలో ఓ వ్యాపారి పట్టణంలోని జన సంచారం ఉండే కూరగాయల మార్కెట్ ఏరియాను అడ్డాగా ఏర్పాటు చేసుకొని ఈ వ్యాపారాన్ని ఏజెంట్లను నియమించుకుని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏజెంట్లతో గ్రామాల్లోని కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా తన నిషేధిత సరుకుకు కాపలాగా మనుషులను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని విస్తరింపజేసినట్టుగా తెలుస్తోంది. దీంతో గుట్కా అంబార్, తంబాకు వంటి నిషేధిత మత్తు పదార్థాలకు యువకులు, బాలురు సైతం అలవాటు పడి అనారోగ్యం పాలవుతున్నారు.
అనుమతుల పేరుతో నిషేధిత వ్యాపారం..
అనుమతుల పేరుతో నిషేధిత గుట్కా, అంబార్, తంబాకు వ్యాపారం విచ్చలవిడిగా నడుస్తుంది. గుట్కా స్థావరంపై అధికారులు దాడులు చేసి పట్టుకున్నప్పటికీ ఈ దందాను సదరు వ్యాపారి మాత్రం సాఫీగానే నిర్వహిస్తుండడం గమనార్హం. అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతుండడమే ఈ దందా ఏ స్థాయిలో కొనసాగుతోందనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. సదరు వ్యాపారి రూ.కోట్లకు పడగలెత్తినట్టుగా పలువురు చర్చించుకుంటున్నారు. పట్టుబడినా కూడా ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదని, పేద ప్రజలు, యువకులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ విషయంపై ఏసీపీని వివరణ కోరగా హైకోర్టు అనుమతులు ఉండచ్చని, పొగాకు సంబంధిత నిషేధితం అయితే పట్టుకుంటామని, ప్రొహిబిటెడ్ కాకుంటే ఫుడ్ ఇన్ స్పెక్టర్ పట్టుకోవాలని అన్నారు.