నిలిచిన ప్రసూతి ఆపరేషన్లు.. గర్భిణీల నరకయాతన..

by Aamani |
నిలిచిన ప్రసూతి ఆపరేషన్లు.. గర్భిణీల నరకయాతన..
X

దిశ,హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పెద్ద దిక్కుగా ఉన్న ఏరియా ఆసుపత్రిలో నాలుగు గంటల పాటు గర్భిణీలు నరకయాతన అనుభవించారు. గైనకాలజీ వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ మత్తు మందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో లేక ఆపరేషన్ల కోసం పురిటి నొప్పులతో నాలుగు గంటలు గర్భిణీలు ఎదురు చూశారు. వారి గోడును పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రసూతి కోసం వచ్చిన వెన్నంపల్లి, బోర్నపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన ఆరుగురు గర్భిణీల బంధువులు వారి ఇబ్బందిని చూసి సిబ్బందితో గొడవకు దిగారు.

ప్రసూతి చేస్తామని ఉదయం 10 గంటలకు ఏం తినకుండా ఖాళీ కడుపుతో రమ్మనడంతో గర్భిణీలు వచ్చి యూరిన్ బ్యాగ్ తో బెడ్లపై పడుకున్నారు. వైద్యులను అడిగితే 12 గంటలకని తర్వాత రెండు గంటలకు అని సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఆపరేషన్ చేయలేదని వారు రోధించారు. గర్భిణీల బంధువులు సూపరిండెంట్, ఆర్ఎం, డీఎంహెచ్వో కు ఫోన్ చేసిన సరైన సమాధానం చెప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మత్తు డాక్టర్ తీరిగ్గా సాయంత్రం 5 గంటలకు రావడం తో యధావిధిగా ఆపరేషన్లను నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed