వామ్మో రోడ్డుపై ఉనుక... ఆదమరిస్తే ప్రాణాలు హరి..

by Disha Web Desk 12 |
వామ్మో రోడ్డుపై ఉనుక... ఆదమరిస్తే ప్రాణాలు హరి..
X

దిశ, మానకొండూర్: మానకొండూరు మండలం ఖాదర్ గూడెం సమీపంలో నేషనల్ హైవే రోడ్డుపై రాత్రి వేళల్లో ఓవర్ లోడ్‌తో వాహనాలు విచ్చలవిడిగా అతివేగంగా వెళ్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున ఉనుక ఓవర్ లోడుతో వాహనం వెళ్ళుతుండగ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదరగూడెం శివారులో నేషనల్ హైవే పై దాదాపు 100 మీటర్ల దూరం భారీ ఎత్తున ఉనుక పడిపోయింది. దీంతో రోడ్డు వెంట వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాత్రివేళల్లో ఓవర్ లోడుతో వెళ్ళే వాహనాలు రోడ్డుపై ఉనుక పడిపోగా అధికారులు పట్టించుకోకపోవడంతో దారిపై వాహనదారులు వెళ్తుండగా రోడ్డుపై పడి ఉన్న ఉనుక పైకి వెళ్లడంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొని అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలైనట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి ఓవర్ లోడ్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed