తహశీల్దార్ కార్యాలయంలో చెత్తబుట్టలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేర్లు

by Disha Web Desk 23 |
తహశీల్దార్ కార్యాలయంలో చెత్తబుట్టలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేర్లు
X

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కు సంబంధించిన అభ్యర్థుల పేర్లు మంగళవారం రోజున చెత్తబుట్టలో దర్శనమిచ్చాయి. ఎమ్మార్వో దగ్గరికి వచ్చిన అభ్యర్థులు చెత్తబుట్టలో తమ పేర్లను చూసి కంగుతిన్నారు. తహసీల్దార్ ఆఫీస్ లో ఏ అధికారులను అడిగిన నాకు తెలియదు అని సమాధానం చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తిరిగి వెళ్లిపోయారు. రేపు గంభీరావుపేట లో జరిగే బహిరంగ సభకు వచ్చి మంత్రి కేటీఆర్ కు తమ బాధలు చెప్పుకుంటామని వెల్లడించారు. వివరణ కోసం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story