ముత్తారం సింగిల్ విండో చైర్మన్,వైస్ చైర్మన్‌పై నెగ్గిన అవిశ్వాసం

by Disha Web Desk 23 |
ముత్తారం సింగిల్ విండో చైర్మన్,వైస్ చైర్మన్‌పై  నెగ్గిన అవిశ్వాసం
X

దిశ, ముత్తారం: ముత్తారం పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ పోతిపెద్ది రమణారెడ్డి పై శుక్రవారం అవిశ్వాసం పెట్టి నెగ్గించుకున్నారు. తాత్కాలిక చైర్మన్ గా మద్దెల వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా అల్లం గోవర్ధన్ ను లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోగా సింగిల్ విండో లో మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను అవిశ్వాసానికి అనుకూలంగా 10 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. 9 మంది డైరెక్టర్లు సుమారు 20 రోజుల క్రితం అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ కు, సింగల్ విండో అధికారికి అందజేశారు. పది సంవత్సరాలుగా సింగిల్ విండో చైర్మన్ గా గుజ్జుల రాజిరెడ్డి కొనసాగుతున్నారు.

సింగిల్ విండో లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఉన్నతాధికారులకు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. సహకార సంఘం చైర్మన్ గా రాజిరెడ్డి, వైస్ చైర్మన్ గా రమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగారు. ఇప్పుడు సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.ముత్తారం సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక చైర్మన్ గా వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా గోవర్ధన్ కు బాధ్యతలు అప్పగించినట్లు సహకార సంఘం ఎన్నికల అధికారి రామ్మోహన్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంథని నియోజవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చక్రం తిప్పుతున్నారు. మొన్న మంథని మున్సిపల్, నేడు ముత్తారం పీఏసీఎస్, మరికొన్ని రోజుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్, లపై అవిశ్వాసం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ సువర్ణ సీనియర్ ఇన్స్పెక్టర్ లు సురేందర్ రెడ్డి రూప తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed