ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్.. మూడేళ్లకే నాలుగు అంతస్థుల భవనమా..?

by Disha Web Desk 12 |
ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్.. మూడేళ్లకే నాలుగు అంతస్థుల భవనమా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఇంతా సంపాదన ఎలా సంపాదించారంటూ ప్రశ్నించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మీ ఎమ్మెల్యే మూడేళ్లలో నాలుగు అంతస్థుల బంగ్లా కట్టుకున్నాడట.. కూలిపోయిందా ఎనకట కట్టింది అంటూ ఎట్లా సంపాదించాడు..? నేను 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నా నాకు ఇళ్లు దిక్కు లేదు. అదే మా అయ్య అవ్వ కట్టించిన ఇల్లు, కట్టె కుర్చీ తప్ప వేరే ఏమీ లేవన్నారు.

మరీ ఈ దొరగారు ఏం చేశారని మూడేళ్లలో నాలుగు ఐదు అంతస్థుల బంగ్లా ఎలా వచ్చింది అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఉన్న బడి కూడా బంద్ అయింది. మళ్లా బడి ఉంటే వేరే విషయం, బడి లేదు పాడు లేదు. నాకు ఎంత జీతమొస్తదో ఆయనకు అంతే జీతం వస్తది ఆయన ఏడ కెళ్ళి తెస్తుండో ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెసోళ్లం 40 ఏళ్ల రాజ్యం చేస్తే మేము ఎలా ఉన్నాం, నాలుగేళ్లలో నువ్వు ఎలా ఉన్నావు అని సూటిగా ప్రశ్నించారు.


Next Story