స్వార్థ రాజకీయాల కోసం తల్లి లాంటి పార్టీని వదులుకుంటావా?

by S Gopi |
స్వార్థ రాజకీయాల కోసం తల్లి లాంటి పార్టీని వదులుకుంటావా?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్ధ రాజకీయాల కోసమే తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారని ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొంతమేర అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు డబ్బులతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నారని, అయితే ఓటర్లు డబ్బులకు ప్రలోభ పడకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి పోటీ చేయడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడని తెలిపారు.



Next Story

Most Viewed