ఎమ్మెల్యే రసమయి ఆదేశాలు బేఖాతర్..ఇబ్బందుల్లో టీఎస్ ఆర్టీసీడ్రైవర్‌లు

by Aamani |
ఎమ్మెల్యే రసమయి ఆదేశాలు బేఖాతర్..ఇబ్బందుల్లో టీఎస్ ఆర్టీసీడ్రైవర్‌లు
X

దిశ,శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం బస్టాండ్ లో సోమవారం నిర్వహించే వారం సంత బస్టాండ్లో నిర్వాహకులు పెట్టివ్వడంతో టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, ప్రయాణికులు ప్రయాణికులు మాట్లాడారు. కేశవపట్నం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కేశవపట్నం బస్టాండ్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో సోమవారం వారం సంత నిర్వహణ కోసం నిబంధనలకు బహిరంగ వేలం పాట నిర్వహించి గ్రామానికి చెందిన వ్యక్తులకు వారం సంత నిర్వహణ కోసం అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వారం సంతకు వివిధ మండలాల నుంచి వచ్చే వస్త్ర వ్యాపారులు కూరగాయల వ్యాపారులు కేశవపట్నం బస్టాండ్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో దుకాణాలు పెట్టుకొని కొనుగోలుదారులకు విక్రయించాల్సిన ఉండగా, టిఎస్ఆర్టిసి బస్టాండ్ లోపలనే కూరగాయల దుకాణాలు, పండ్ల దుకాణాలు పెట్టడముతో కొనుగోలుదారులు అతి దుకాణాల్లో కొనుగోలు చేస్తున్న సమయంలో ఎలాంటి రోడ్డు ప్రమాదం జరుగుతుందోనని టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇట్టి విషయమై ఈ నెల 12 నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో టీఎస్ఆర్టిసీ సంస్థ తరఫున సమావేశానికి హాజరైన అధికారులు ఉద్యోగులు సర్వసభ్య సమావేశంలో బస్టాండ్ లోపల వారం సంత నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే స్థానిక ఎంపీడీవో, ఎస్సై కలిసి, టిఎస్ఆర్టిసి డ్రైవర్లకు ఎలాంటి కష్టం రాకుండా శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఆదేశించారు. నిర్వాహకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం. సిబ్బంది. నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో, నేడు జరిగిన సోమవారం వారం సంతలో బస్టాండ్ లోనే కూరగాయలు పండ్ల దుకాణాలు పెట్టడంతో టీఎస్ ఆర్టీసీ డ్రైవర్ల కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బస్టాండ్ లో దుకాణాలను పెట్టకుండా సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని తమ కష్టాలు తీర్చాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story