అదృశ్యమైన బాలిక నిజామాబాద్ లో ప్రత్యక్షం

by Sridhar Babu |
అదృశ్యమైన బాలిక నిజామాబాద్ లో ప్రత్యక్షం
X

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఓ బాలిక అదృశ్యమైన ఘటన పట్టణంలో గత రెండు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పట్టణంలోని విజ్డమ్ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి గురువారం మధ్యాహ్నం స్నేహితులను కలిసి వస్తానని వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు చెప్పగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు గురువారం నుండి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం నిజామాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ ఎస్సై సంజీవ్ ఆధీనంలో బాలిక ఉన్నట్టు ఆచూకీ తెలిసింది. సమాచారం అందుకున్న మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తన బృందంతో నిజామాబాద్ చేరుకొని అమ్మాయిని తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed