దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదు : జమ్మికుంట కౌన్సిలర్‌లు

by Disha Web Desk 23 |
దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదు : జమ్మికుంట  కౌన్సిలర్‌లు
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు కౌన్సిలర్ల పై దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని, అలా చేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు పొనగంటి మల్లయ్య, రావికంటి రాజులు అన్నారు. బుధవారం పట్టణంలోని కౌన్సిలర్ రావికంటి రాజు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం రాత్రి పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు తాను తారసపడ్డ సమయంలో రాజేశ్వరరావు దుర్భాషలాడుతూ, తను కొట్టేందుకు ప్రయత్నించాడని, రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజు చెప్పుకొచ్చారు.

మరోసారి కౌన్సిలర్ల పై అపవాదు,నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉన్న రాజేశ్వరరావు సమయస్ఫూర్తి,లౌక్యంగా వ్యవహరించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం సబబు కాదని కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య పేర్కొన్నారు. చైర్మన్ రాజేశ్వరరావు అతడు చేసిన తప్పులను కప్పుకొచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని,కానీ జమ్మికుంట ప్రజలు చైతన్యవంతులని, చైర్మన్ తన పద్ధతిని మార్చుకోకపోతే ప్రజల తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. విలేకరుల సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read Disha E-paper

Next Story