చుక్క మందు పంచకుండా గెలిచా.. మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
చుక్క మందు పంచకుండా గెలిచా.. మంత్రి KTR కీలక వ్యాఖ్యలు
X

దిశ, సిరిసిల్ల: తమిళనాడులోని తిరుప్పూర్‌తో సిరిసిల్ల నేతన్నలు పోటీ పడి వస్త్రోత్పత్తి చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తిరుప్పూర్‌లో రూ. 40 వేల కోట్ల ఉత్పత్తులు చేస్తున్నారని, సిరిసిల్లలో 2 వేల కోట్లు మాత్రమేనన్నారు. స్టేట్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న గూడూరు ప్రవీణ్.. అధికారుల బృందంతో కలిసి అక్కడ క్షేత్ర స్థాయి పర్యటన చేసి ఆ విధంగా సిరిసిల్లలో మార్పులు తీసుకరావాలని కేటీఆర్ సూచించారు.

రూ. 300 కోట్లతో బతుకమ్మ చీరెలు నేసే పని అప్పగించి సిరిసిల్ల ఆడబిడ్డలకు సారెగా ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నేత కార్మికులకు 40 శాతం, మర కార్మికులకు 10 శాతం రాయితీలు ఇస్తున్నామని, అపెరల్ పార్క్‌లో 8 నుండి 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని, పెద్దూరులో 80 ఎకరాల్లో వీవిగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో కోటి బతుకమ్మ చీరెలు అందించేందుకు సిద్దం చేశామని, తెలంగాణ రాష్ట్రానికి ఈ చీరెలు సరఫరా చేయడం సిరిసిల్లకే గర్వ కారణమన్నారు. గిఫ్ట్ స్మైల్ పథకం కింద రాష్ట్రంలో 120 అంబూలెన్స్‌లు సమకూర్చుకోగా సిరిసిల్లలో ఆరు ఏర్పాటు చేసుకున్నామన్నారు.

జిల్లాలోని 6 వేల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నామన్నారు. సిరిసిల్లను విద్యారంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో విద్యా సంస్థల ఏర్పాటు చేసుకున్నామని జేఎన్ టీయూ కాలేజీతో పాటు మెడికల్, వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు. సిరిసిల్ల, వేములవాడ అభివృద్ధికి శాయశక్తులా పని చేస్తున్నానని కేటీఆర్ వెల్లడించారు. టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదని, అందరికి తెలివి ఉంది.. వాటిని వాడుకొని జీవితంలో ఎలా పైకి వచ్చే విధంగా ఆలోచించి ముందుకు సాగలని సూచించారు.

మందు పంచకుండా గెలిచా..

సిరిసిల్ల నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు గెలిచిన తాను.. చుక్క మందు పంచకుండా గెలిచానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు చేసే ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరేనని, గెలవాలంటే ప్రజా సేవ చేస్తే చాలునన్నారు. తాను ఎలక్షన్లలో ఓటర్లకు మందు పంచేది, డబ్బు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అలాంటి దరిద్రపు పని తాను చేసేదే లేదని, తనపై పోటీ పడేందుకు చాలా మంది ఉన్నారని వారు కూడా ప్రజా సేవ చేసి వారి మద్దతు కూడగట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 10మందికి ఉద్యోగం ఇచ్చి వారి జీవితాలను నిలబెట్టే విదంగా ఎదగాలని హితవు పలికారు. ప్రజా సేవ చేసి తరించి వారి మెప్పు పొందాలి కానీ ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా వ్యవహరించవద్దని కోరారు.


Next Story

Most Viewed