బండి సంజయ్‌కి విమర్శించే స్థాయిలేదు.. టీఆర్ఎస్

by Dishafeatures2 |
బండి సంజయ్‌కి విమర్శించే స్థాయిలేదు.. టీఆర్ఎస్
X

దిశ, తిమ్మాపూర్: బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా బాధ్యతలను మరిచిపోయి కరీంనగర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పిచ్చి పట్టిన వాడిలా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తిరుగుతున్నారని మేయర్ సునీల్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలను తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై అనవసరపు ఆరోపనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటిఆర్‌పై బండి సంజయ్ చేస్తున్న అసత్యపు ఆరోపనలను తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో గురువారం రోజు మీడియా సమావేశంలో మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ..బీజేపి నేత బండి సంజయ్ పొరపాటు,గ్రహపాటున కరీంనగర్ ఎంపిగా గెలిచారని ఎద్దేవ చేశారు. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ పై రెండు సార్లు చిత్తు చిత్తుగా ఓడిపోయి సింపతి పై ఎంపిగా గెలిచారని అన్నారు.

కరీంనగర్ నియోజక వర్గానికి ఒక్క రూపాయి కూడా తేకుండా ఎలాంటి అభివృద్ది పనులు చేయకుండా,ప్రజలకు అందుబాటులో లేకుండా దుష్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సంజయ్ చేస్తున్న వాక్యలకు ప్రజలు కమెడియన్ మాటలని నవ్వుకుంటున్నారని అన్నారు.ఉన్నత చదువు చదివి ఉద్యోగం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగాన్ని వదిలి వచ్చిన ఘన చరిత్ర మంత్రి కేటీఆర్‌దని అన్నారు. 2006 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనబడని చరిత్ర ఎంపి బండి సంజయ్‌దని ఎద్దేవ చేశారు. 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కంపెనీల పెట్టుబడులకు నిలయంగా చేసి వందల కంపెనీలను తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకత్వం మంత్రి కేటిఆర్‌దన్నారు. ఎన్నో ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రావడం మంత్రి కేటీఆర్ నాయకత్వ పటిమ అన్నారు.

అలాంటి రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం, బండి సంజయ్ అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి గానీ కరీంనగర్ నియోజకవర్గానికి గానీ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తేకుండా అభివృద్ది అంటే అర్థం తెలియని వ్యక్తి బండి సంజయ్ అని ఆరోపించారు. దేశంలో ఎన్నో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ. పరిశ్రమలను మూసివేస్తున్న ప్రభుత్వం బీజేపి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి అడ్డుపుల్లలు వేస్తూ.. అబద్దాలతో పబ్బం గడుపుకుంటూ.. నిరుద్యోగులను తప్పు దోవ పట్టిస్తున్న నీకు మంత్రి కేటీఆర్‌ను విమర్శించే హక్కులేదని హెచ్చరించారు. కేటిఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్ కి లేదన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి.. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తే.. అబద్దాలు,అసత్య ప్రచారంతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండి పడ్డారు.పార్లమెంట్ సభ్యునిగా మీరు చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు.

పెరుగుతున్న ధరలకు బీజేపి ప్రభుత్వం కారణం కాదా..? అని ప్రశ్నించారు.నిత్యవసర ధరలు,పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరిచిన పార్టీ బీజేపి పార్టి అని మండిపడ్డారు.ఏ రోజైన పేదల పక్షాణ నిలబడి మాట్లాడావా...? బండి సంజయ్ అంటూ ప్రశ్నించారు.మీ పతనానికి ఆరంభం అయింది మీ మాటలు ప్రజలు నమ్మె స్థితిలో లేరు మీకు సరైన బుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్త బిచ్చ గాడు పొద్దు ఎరగనట్టు గా బండి సంజయ్ తీరు ఉందన్నారు.రైతులకు వరి వేయండి నేను వడ్లు కొనిపిస్తా అని కోతలు కొసావ్...ఏ రోజు అయినా ధాన్యం కొనుగోళ్ళ గురించి మాట్లాడావా...? రైతుల పరి స్థితి ఎలా ఉందో తెలుసుకున్నావా...?అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం,టీఆర్ఎస్ పార్టీ ప్రజలు,రైతుల పక్షాన పోరాటం చేసే పార్టీ అని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్లు కంసాల శ్రీనివాస్,దిండిగాల మహేష్,బుచ్చిరెడ్డి,తోట రాములు,బండారి వేణు,నాంపెల్లి శ్రీనివాస్,అంజయ్య,కుర్ర తిరుపతి,జంగిలి సాగర్,టీఆర్ఎస్ నాయకులు అర్ష మల్లేశం,నక్క కృష్ణ,కాశెట్టి శ్రీనివాస్,తుల బాలయ్య, పిట్టల శ్రీనివాస్,ఖరీం,ఉయ్యాల శ్రీనివాస్,బాలరాజు,అనిల్,హామీద్,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed