చొప్పదండి నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా : మేడిపల్లి సత్యం

by Aamani |
చొప్పదండి నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా  తీర్చిదిద్దుతా : మేడిపల్లి సత్యం
X

దిశ, రామడుగు : చొప్పదండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం రామడుగు మండలంలోని కొక్కెరకుంట, వన్నారం, మోతె (కోత్తపల్లి), రుద్రారం, రంగసాయిపల్లి, దత్తోజిపేట, వెంకట్రావుపల్లి, లక్ష్మిపూర్, శ్రీరాములపల్లి, తిర్మలాపుర్, గుండి, రాంచంద్రపూర్, రామడుగు, కోరటపల్లి, గోలిరామయ్యపల్లి, పందికుంటపల్లి(కుర్మపల్లి), కిష్టాపూర్, వెలిచాల గ్రామాలలో కోటి ఇరవై లక్షల అభివృద్ధి పనులకు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గుండి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని, చొప్పదండి నియోజకవర్గం గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదని, నాలుగుకోట్ల మందికి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు ఉచిత వైద్యాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, చేవెళ్లలో ఐదువందలకే సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది అని అన్నారు.

అదే విధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంను, ఆర్టీసీలో జీరో టికెట్ ఎలాగైతే అందజేస్తున్నారో అదేవిధంగా జీరో చార్జి బిల్ రశీదు అందజేయడం జరుగుతుందని, నియోజకవర్గానికి పదికోట్ల ఎస్ డి ఎఫ్ నిధులను విడుదల చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, దేశరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కోల రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీపీ తడగొండ అంజలి హన్మంతు, ఉప్పుల అంజనీప్రసాద్, యూత్ అధ్యక్షులు సుధీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేణికుంట బాపు రాజ్, గుడ్ల మల్లికార్జున్, శేఖర్, కర్ర రాజిరెడ్డి, తడగొండ నర్సింగ్ బాబు, తడగొండ విష్ణు, దుర్గం వెంకట సాయి కృష్ణ, మానుపాటి వెంకటేషం, పార్టీ కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed