రోడ్డుకు అడ్డంగా లారీ బోర్తా... ఎక్కడంటే..?

by Dishanational1 |
రోడ్డుకు అడ్డంగా లారీ బోర్తా... ఎక్కడంటే..?
X

దిశ, కోరుట్ల రూరల్: పట్టణ శివారులోని వెటర్నరీ కళాశాల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఒక లారీ రోడ్డుపై బోల్తా పడింది. పత్తి లోడుతో నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనక నుండి వస్తున్న మరో లారీ ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెనక వస్తున్న లారీ రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లగా, పత్తి లోడుతో ఉన్న లారీ రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పత్తి లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పత్తి లోడు రోడ్డుపై చెల్లాచెదురైంది. జాతీయ రహదారిపై లారీ అడ్డంగా పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.



Next Story

Most Viewed