గల్లీ గల్లీలో బెల్టు షాపులు.. గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం

by Disha Web Desk 12 |
గల్లీ గల్లీలో బెల్టు షాపులు.. గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
X

దిశ, అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని గడి పెద్దాపూర్, ముస్లాపూర్, చిల్వర్, భైరన్ దిబ్బ, మాందాపూర్, పలు గ్రామాల్లో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. అడ్డు అదుపు లేకుండా, రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం అమ్మకాలు జరిపి అమాయక ప్రజలను పీడిస్తున్నారు.

బెల్టుషాపులను నియంత్రించే ఎక్సైజ్ అధికారులకు చేతులు తడపడంతో ఆ వైపు కన్నెత్తి చూడక పోవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసిన బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. దీని వల్లనే రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తుందని అతిగా ప్రాధాన్యత కల్పిస్తుందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గురువారం నాడు అల్లాదుర్గం వైన్స్ నుంచి పట్ట పగలు 161 జాతీయ రహదారి గుండా ప్రత్యేక వాహనం (ఆటో)లో మద్యం పెద్దాపూర్ గ్రామానికి తరలిస్తున్నారు. ఒక సీసా కు 10 రూ.ల చొప్పున అదనంగా వసూలు చేస్తూ ప్రత్యేక వాహనాల్లో మద్యం నేరుగా గ్రామంలోని బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు చోద్యం చేస్తుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లాదుర్గం వైన్స్ నుండి ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల యాజమాన్యం పై చర్యలు చేపట్టి, ఆటోలను వెంటనే సీజ్ చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎక్స్సైజ్ అధికారులపై జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

యువత మద్యం కు బానిసలయ్యే ప్రమాదం

గల్లీ గల్లీలో బెల్టుషాపులు వెలసిన నేపథ్యంలో భావి తరానికి భారత పౌరులుగా పిలువబడే యువత కూడా మద్యం కు బానిసై పోయే ప్రమాదం నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపే వారికి ప్రోత్సహించడం సరికాదని యువత భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలంటే బెల్టు షాపులను తొలగించాలని అంటున్నారు.


Next Story

Most Viewed