Breaking News.... మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!

by Dishanational1 |
Breaking News.... మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
X

దిశ, వీణవంక: రెడ్డి అమ్మాయిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి తీరును ఓసీ జేఏసీ నేతలు ఖండించారు. రెడ్డి మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, లేదంటే తీవ్రపరిణామాలు ఎదురుకోవలసి వస్తుందని హెచ్చరించారు. రెడ్డి మహిళల గురించి ఎలాంటి అవగాహనా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని పద్ధతి మార్చుకోవాలని అన్నారు. మీరూ ఏ కులం అమ్మాయిని అయినా మీ కొడుకులకు చేసుకోండని, అంతేకాని రెడ్డి అమ్మాయిల గురించి అవగాహనా లేని మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఒక రాష్ట్ర మంత్రిగా, బాధ్యతగల వ్యక్తిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ వీణవంక మండల అధ్యక్షుడు నల్ల కొండల్ రెడ్డి, మూల పుల్లా రెడ్డి, జిల్లా ఐక్యవేదిక అధ్యక్షులు జున్నుతుల రాజిరెడ్డి, పాక్స్ డైరెక్టర్లు మాడుగురి సమ్మిరెడ్డి, చెక్కబండి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెడ్డి సంగం నాయకులు పత్తి సమ్మిరెడ్డి, నాగిడి రాం రెడ్డి, కామిడీ శ్రీపతి రెడ్డి, అలేటి శ్రీనివాస్ రెడ్డి,మిరాల సమ్మి రెడ్డి, ఎల్క దేవాల్ రెడ్డి, కంతల రాజిరెడ్డి పాల్గొన్నారు.






Next Story

Most Viewed