నేను కూడా డప్పు కొడుతున్నా చూడండి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Dishanational1 |
నేను కూడా డప్పు కొడుతున్నా చూడండి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, రాయికల్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని కొమురం భీం విగ్రహం నుండి అంగడి బజార్, గాంధీ చౌక్, శివాజీ విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీలో గిరిజన సంప్రదాయ డప్పును ఆయన సరదాగా వాయించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న గిరిజన కళాకారుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ర్యాలీలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story