మీ బండికి నెంబర్ ప్లేట్ లేదా...? అయితే ఈ వార్తను ఒక్కసారి చదవండి

by Dishanational1 |
మీ బండికి నెంబర్ ప్లేట్ లేదా...? అయితే ఈ వార్తను ఒక్కసారి చదవండి
X

దిశ, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఎక్కువగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలపైనే దృష్టి సారించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడే వారే నెంబర్ ప్లేటు లేని వాహనాలను వినియోగిస్తుంటారనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాల కట్టడికై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాహన చోదకునితో అక్కడికక్కడే నెంబర్ ప్లేటును బైకులకు అమర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కాగా నారాయణపేట జిల్లాలో ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో ట్రాఫిక్ పోలీసుల సేవలు ఈ మధ్యనే ప్రారంభమైన విషయం తెలిసినదే.

Also Read...

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై Konda Surekha సీరియస్


Next Story