రాజన్న ఆలయంలో కార్తీక మాస వేడుకలు

by Sridhar Babu |
రాజన్న ఆలయంలో కార్తీక మాస వేడుకలు
X

దిశ, వేములవాడ : కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం కళావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక దీపోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఈఓ కె.వినోద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో స్థానిక కళాకారులు నమిలకొండ జయంత్, సంతోష్ బృందం వారిచే భక్తి విభావరి గానం నిర్వహించారు. సుహాసినీ బృందం చేత కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని సాయత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏఈఓ గజ్వేల్లి రమేష్ బాబు, పర్యవేక్షకులు నరసయ్య, తిరుపతి రావు, ప్రోటోకాల్, పర్యవేక్షకుడు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed