- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రెండో నగరంగా కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్
దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని 18వ డివిజన్ లోని రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో రూ.1.90 కోట్ల పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగర పాలక సంస్థలో విలీనమైన డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రేకుర్తి 18, 19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. ప్రారంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధగుని మాధవి కృష్ణ గౌడ్, ఏదుల్ల రాజశేఖర్ కార్పొరేటర్లు, వి.రాజేందర్ రావు, భూమాగౌడ్, జంగిలి సాగర్, దీండిగాల మహేష్, గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, బీఆర్ఎస నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్ డివిజన్ వాసులు, తదితరులు పాల్గొన్నారు.