- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Minister Harish Raoని కలిసిన కందుల!

దిశ, గోదావరిఖని: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని సోమవారం కందుల సంధ్యారాణి క్యాంప్ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రామగుండం ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి పనులు, ఇక్కడి ప్రజలకి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కందుల సంధ్యారాణిని కొనియాడారు. మహిళా సాధికారత కోసం, భారత రాష్ట్ర సమితి పార్టీ కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజల కష్ట - సుఖాలలో పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంభంధాలు కొనసాగిస్తున్నరన్నారు. కష్టపడి పని చేసే మీలాంటి నాయకులపై పార్టీ అధిష్టానం తప్పకుండా దృష్టి సారిస్తుందని, తద్వారా ప్రజలకు.. పార్టీ కార్యకర్తలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు.