తమ హక్కుల పరిరక్షణ కోసం జర్నలిస్టులు కృషి చేయాలి.. అల్లం నారాయణ

by Dishafeatures2 |
తమ హక్కుల పరిరక్షణ కోసం జర్నలిస్టులు కృషి చేయాలి.. అల్లం నారాయణ
X

దిశ, గోదావరిఖని: జర్నలిజం విలువలను కాపాడుతునే తమ హక్కుల పరిరక్షణ కోసం జర్నలిస్టులందరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభల్లో అల్లం నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా షాక్ న్యూస్ లతో దూసుకుపోతున్న తరుణంలో, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జనవరి నెలలో హైదరాబాద్ లో జరగనున్న టియూడబ్ల్యూజే హెచ్ 143 ఐజేయూ ప్లీనరీకి భారీగా జర్నలిస్టులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా చైర్మన్ తోపాటు ఐజేయూ జాతీయ నాయకులు ప్లీనరీలో పాల్గొంటారన్నారు. మూడు రోజులు జరగనున్న ప్లీనరీని జర్నలిస్టులు విజయవంతం చేయాలని కోరారు. తాను ఎల్లప్పుడూ జర్నలిస్టుల వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.


సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత.. రామగుండం MLA కోరుకంటి చందర్

సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దళిత బంధు డబుల్ బెడ్ రూమ్, సొంత ఇంటి పథకం లాంటి పథకాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. దాదాపు అందులో ఇప్పటివరకు రూ.42 కోట్లను జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత జర్నలిస్టుదని, ప్రభుత్వంలో జరుగుతున్న పాలనను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత జర్నలిస్టులదే అన్నారు. అల్లం నారాయణ ఆధ్వర్యంలో ప్రతి విలేకరి సంక్షేమం వైపు అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

READ MORE

జర్నలిస్ట్ కుటుంబానికి MLA రఘునందన్ రావు పరామర్శ

Next Story

Most Viewed