జగిత్యాల ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి.. ఏబీవీపీ నాయకుల డిమాండ్..

by Disha Web Desk 20 |
జగిత్యాల ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి.. ఏబీవీపీ నాయకుల డిమాండ్..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రైవేట్ స్కూళ్ల దోపిడిని అరికట్టాలని ఏబీవీపీ బంద్ కు పిలుపునిస్తే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏబీవీపీ ఒక రాజకీయ పార్టీ అనుబంధ సంస్థ అని మాట్లాడడం తగదని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాపాక సాయికుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు ఎమ్మెల్యే తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో కార్పొరేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ ఉద్యమం చేస్తే ఎమ్మెల్యే మాత్రం కార్పొరేట్ శక్తులకు సహకరించే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. పక్క రాష్ట్రాల విద్యావ్యవస్థ గురించి మాట్లాడే ఎమ్మెల్యే ముందుగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ శ్రీను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవీన్ సునీల్, కార్తీక్ నగర కార్యదర్శి మనువాడ నందు, శ్రావణ్, మనోహర్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed