పాత నేరస్తులపై నిఘా ఉంచాలి.. జగిత్యాల ఎస్పీ భాస్కర్

by Dishafeatures2 |
పాత నేరస్తులపై నిఘా ఉంచాలి.. జగిత్యాల ఎస్పీ భాస్కర్
X

దిశ, మెట్ పల్లి: జిల్లాలోని పాత నేరస్థులపై నిఘా ఉంచాలని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ సూచించారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సోమవారం ఎస్పీ భాస్కర్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ.. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. వారు చెప్పే సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరించాలని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని చెప్పారు. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా కేసును పరిష్కరించడానికి ప్రయత్నించాలని సూచించారు. టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్న ఎస్పీ.. TS COPs ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయడం విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచరాదని సూచించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్లు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డీస్పీ రవీంద్ర రెడ్డి, సీఐ లక్ష్మి నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.



Next Story