మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ లబ్దిదారుల ఎంపికకై ఇంటర్వ్యూ

by Disha Web |
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ లబ్దిదారుల ఎంపికకై ఇంటర్వ్యూ
X

దిశ, గోదావరి ఖని: ఈ నెల 8, 9 తేదీలలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ లింక్డ్ సబ్సిడీ రుణాల లబ్దిదారుల ఎంపికకై ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నట్లు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి.సుమన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. గడువు తేదీ ముగిసే నాటికి ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న 1267 మంది అభ్యర్థులకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేటగిరీ – I లో 15 , కేటగిరీ – IIలో 8 యూనిట్లు రామగుండం మండలానికి కేటాయించడం జరిగిందని అన్నారు. అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో ఆయా తేదీలలో హాజరు కావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు మెప్మా విభాగంలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
Next Story