- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేములవాడలో యారన్ డిపో ప్రారంభం
దిశ, వేములవాడ : ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా యారన్ డిపో ను ప్రారంభించుకోవడం శుభపరిణామమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో రూ. 50 కోట్లతో ఏర్పాటు చేసిన యారన్ డిపోను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించి నేతన్నలకు యారన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నల 30 సంవత్సరం కోరికైన నూలు డిపోను ఏర్పాటు చేసుకున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, మంత్రుల సహకారంతో నూలు డిపో ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సిరిసిల్ల నేతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నట్టు తెలిపారు.
సంవత్సరం కాలంలో చేనేత జాళి శాఖ నేతన్నలకు రూ.375 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నేతన్నలకు పెట్టిన బకాయిలను చెల్లించామని అన్నారు. అనేకసార్లు నేతన్నలకు భరోసా కల్పించామని, చేనేత క్లస్టర్ గా ఉన్న వేములవాడకు యారన్ డిపో వస్తే కొంత మంది ఓర్వలేక పోతున్నారని అన్నారు. గతంలో 1000 కిలోమీటర్లు దూరం నుండి దారం వస్తే చూస్తూ ఉన్నవారు నేడు 10 కిలోమీటర్ల దూరం నుండి దారం వస్తే తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు. టెస్కో సహకారంతో 90% క్రెడిట్ పై నూలు ఇవ్వడం జరుగుతుందని, సిరిసిల్ల నేతన్నలకి బహిరంగ మార్కెట్ లో ఉన్న రేటుపై యారన్ ఇస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేశారని, గత పాలకులు ఈ ప్రాంతంలోని పాలిస్టర్, కాటన్ పరిశ్రమను నిలువునా ముంచారని ఆరోపించారు.
రాబోవు రోజుల్లో చేనేత కార్మికులకు అండగా ఉంటామని, సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యారన్ డిపో ను రూ.50 కోట్ల నుండి రూ.100 కోట్లకు పెంచేలా కృషి చేస్తానని, ఎస్సీ, ఎస్టీ లకు చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది చూసి ఓర్వలేక జిల్లా కలెక్టర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిరుపేదలకు చెందాల్సిన భూములు వారికే ఉపయోగపడేలా చేస్తామని, వేములవాడ సిరిసిల్లలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జౌళి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ రావు, ఏడీ సాగర్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ తదితరులు పాల్గొన్నారు.