- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష
డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష పడిన ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, కరీంనగర్ రూరల్ : డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష పడిన ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ పోలీసులు ఇటీవల చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన పర్ష శరత్ కుమార్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుపడ్డాడు. రూరల్ పోలీసులు మంగళవారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. నిందితుడికి ఆరు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్టు కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై విలువైన జీవితాన్ని కోల్పోయి కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకురావడం సరైంది కాదని సీఐ పేర్కొన్నారు.
Next Story






