రంగు మారుతున్న మిషన్ భగీరథ నీరు

by Mahesh |
రంగు మారుతున్న మిషన్ భగీరథ నీరు
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో మిషన్ భగీరథ నీరు గత వారం రోజులుగా పూర్తిగా కలుషితంగా వస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి సుమారు 50కి పైగా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, మిషన్ భగీరథ నీరు కనీసం వంట పాత్రలు శుభ్రం చేసుకోవడానికి, స్నానాలకు కూడా ఉపయోగించుకునే విధంగా లేవని వార్డు ప్రజలు వాపోతున్నారు. మిషన్ భగీరథ నీరు కలుషితం కావడం తో రంగు మారి రావడంపై వార్డు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ నీరు వాడడం వల్ల శరీరంపై దురద లేస్తుందని చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ చర్మమంతా దురద లేచి ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీరు తాగడం వల్ల చర్మ వ్యాధులు ప్రబలి వివిధ ఆస్పత్రుల చుట్టూ తిరిగి వ్యాయ ప్రయాసలకు గురవుతున్నామని మిషన్ భగీరథ, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీటిని అందేలా చూడాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed