కంకర వేశారు.. తారు మరిచారు

by Aamani |
కంకర వేశారు.. తారు మరిచారు
X

దిశ,గంగాధర : గంగాధర మండల కేంద్రం నుండి షానగర్ కొత్తపల్లి వెళ్లే దారి అధ్వానంగా ఉంది. కంకర వేశారు కానీ... దాదాపు 6,7 నెలల నుండి తారు వెయ్యక పనులు పూర్తి కాలేదు. మండల కేంద్రానికి వివిధ మండలాల నుంచి నిత్యం వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు. వాహన టైర్ నుండి కంకర రాళ్లు ఎగిరి పడడంతో పలువురికి గాయాలపాలవుతున్నారు. మరోవైపు దుమ్ము దులితో రహదారి వెంట వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక ఈ దారి వెంబడి నిత్యం రైతులు పంట పొలాల వద్దకు వెళ్లాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఈ దారి వెంబడి గంగాధరలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు చొప్పదండి, రామడుగు మండలాల ప్రజలు ఈ దారి వెంబడే రావడంతో ఈ దారిలో కంకర తేలి ఉండడంతో ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నా మంటున్నారు. ఇకనైనా అధికారులు ఈ ప్యాచ్ వర్క్ ను త్వరగా పూర్తి చేయాలని వాహనదారుల ఇబ్బందులు తీర్చాలని వారు కోరుకుంటున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్యాచ్ వర్క్ తొందరగా పూర్తి చేసి గంగాధర షానగర్ కొత్తపల్లి నుంచి ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తారు పనులు పూర్తి చేయాలని అధికారులను నాయకులను వాహనదారులు కోరారు.

Next Story

Most Viewed